CMRF చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

WGL: నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు శనివారం నర్సంపేట పట్టణంలోని సకినాల కావ్య జ్యోతికి రూ.56 వేల విలువ గల చెక్కు, పులిచేరు రఘువర్మకు రూ. 22వేల చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటికి వెళ్లి అందచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.