నేడు ప్రజావాణి కార్యక్రమం

HYD: జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉప కమిషర్ సురేందర్ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్, మైలార్ దేవపల్లి, శాస్త్రీపురం, సులేమాన్ నగర్, అత్తాపూర్ డివిజన్లకు చెందిన ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలను లిఖితపూర్వకంగా ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదు చేయాలన్నారు.