VIDEO: డీసీఎం బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్
JN: లింగాల ఘనపూర్ మండలం చిటూరు గ్రామం అప్పిరెడ్డిపల్లి క్రాస్ వద్ద గురువారం డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ జహీరుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొక్కజొన్న లోడుతో వెళ్తున్న డీసీఎం అతివేగం, అజాగ్రత్తే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మృతుడు భువనగిరి నివాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.