ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

GNTR: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అదే విధంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 53 మంది అధికారులకు వరద పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.