క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సింగరేణి GM

క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సింగరేణి GM

KNR: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని GM చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో వివిధ క్రీడలలో నెల పాటు కోచ్ల సారధ్యంలో శిక్షణ ఇస్తామని GM తెలిపారు. మానసిక ఉల్లాసానికి, పోటీ తత్వానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.