'గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది'
SRCL: జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అరోపించారు. మాయమాటలు చప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసిందని విమర్శించారు.