VIDEO: శిథిలావస్థలో మంచి నీటి ట్యాంక్
NTR: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో సురక్షిత మంచి నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రజలకు ప్రమాదంగా మారింది. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉండడంతో ట్యాంక్‌ను తొలగించి నూతన ట్యాంక్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే డిస్మాంటిల్ కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.