రహదారిని తవ్వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

BPT: బల్లికురవ-అద్దంకి రహదారిలో 33వ మైలు వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యా మ్నాయంగా ఇటీవల రహదారి ఏర్పాటు చేశారు.ఈ రహదారి గుండానే వాహనాలు వెళ్తుంటాయి.అయితే ఆదివారం హఠాత్తుగా ప్రత్యామ్నాయ రహదారిని తవ్వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.