గుంతల మయమైన రహదారులు.. ఆగిపోయిన కారు
MDK: నార్సింగి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారుల పరిస్థితి విషమంగా మారింది. శేరీపల్లి ప్రధాన రహదారిలో రోడ్డుమీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. శనివారం ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారు, రోడ్డులోని గుంతల కారణంగా ఆగిపోయింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరారు.