"వేయి స్తంభాల ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు"
HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపాలు పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.