విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ మార్పు

విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ మార్పు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్వికాస పనుల నేపథ్యంలో జ్ఞానాపురం సర్కిల్ వద్ద ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ ఆఫీస్ ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. 27వ తేదీ నుంచి రిజర్వేషన్ సేవలు మెయిన్ స్టేషన్ భవనంలో గేట్ నెం.2, గేట్ నెం.3 మధ్య ఉన్న జనరల్ బుకింగ్ ఆఫీస్‌లో కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.