శశికల కొత్తపార్టీ పేరు ఇదే..!
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీకే శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. 'ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం' అని పేరు పెట్టారు. అలాగే, తన పార్టీ గుర్తుగా 'కొబ్బరి చెట్టు'ను ప్రకటించారు.