నేడు MPDOలకు ఒక రోజు శిక్షణ: కలెక్టర్

నేడు MPDOలకు ఒక రోజు శిక్షణ: కలెక్టర్

VZM: ద్వారపూడిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో శనివారం MPDOలకు ఒక రోజు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు. శుక్రవారం SWPC కేంద్రాన్ని సందర్శించి, సంపద తయారవుతున్న విధానాన్ని పరిశీలించారు. చెత్త నుంచి తయారైన ఎరువును ఎక్కడ, ఎలా విక్రయిస్తున్నారో?ఆరా తీశారు. నర్సరీలను పెంచే వారిని సంప్రదించి, ఎరువును విక్రయించి ఆదాయం పొందవచ్చన్నారు.