మిద్దె వెంకటేశ్వర్లుకు 'దళిత రత్న' పురస్కారం..
SRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘దళిత రత్న' అవార్డుకు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాచవారిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ దళిత నాయకుడు, మాజీ సర్పంచ్ మిద్దె వెంకటేశ్వర్లు మాదిగ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.