ఎమ్మెల్యేని కలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు

ఎమ్మెల్యేని కలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు

W.G: నూతనంగా ఎన్నికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజును సోమవారం పెదమిరం క్యాంప్ కార్యాలయం వద్ద పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు మరియు భీమవరం డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అలాగే పలువురు సిఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలుసుకుని బొకే అందజేశారు. ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ..నియోజకవర్గంలోని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసు నిర్వహించాలని ఆయన కోరారు.