VIDEO: 18న అంతర్ రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు
NDL: బేతంచెర్ల మండలం శంకరాపురంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 18న అంతర్ రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభాలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల నగదు బహుమతులను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.