తవ్వకాలతో భగీరథకు బ్రేక్..!

తవ్వకాలతో భగీరథకు బ్రేక్..!

మహబూబాబాద్ అనంతారం సమీపంలో నేషనల్ హైవే 930P విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ పనుల నిర్వహణలో భాగంగా జరుపుతున్న తవ్వకాల వల్ల ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలిపోయింది. దీనివల్ల భారీగా తాగునీరు వృథా కావడమే కాకుండా, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది.