దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: చంద్రయ్య

MNCL: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో సాదా బైనామా ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఒకటి నుండి ఐదు వరకు ఫార్మాట్ల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దిలీప్ ఉన్నారు.