శ్రీశ్రీశ్రీ దారగంగమ్మ అమ్మవారి పండగ చాటింపు

శ్రీశ్రీశ్రీ దారగంగమ్మ అమ్మవారి పండగ చాటింపు

VZM: శృంగవరపుకోటలో వెలసిన గ్రామదేవత శ్రీ దారగంగమ్మ అమ్మవారి పండుగ మహోత్సవంలో ఈ రోజు అమ్మవారి సన్నిదిలో అనువంశక పూజారి మోపాడ.గౌరినాయుడు దారగంగమ్మ అమ్మవారి చెవిలో చాటింపు వేశారు. అమ్మవారి సన్నిధిలో డప్పుకొట్టి చాటింపు వేసి శృంగవరపుకోట గ్రామం అంతా చాటింపు వేశారు. 26వ తేదీన అమ్మవారి నిజరూప దర్శనం, 27 అమ్మవారి తోలేళ్ళు, 28వ తేదీన అమ్మవారి అణుపు కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.