క్రికెట్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేత

క్రికెట్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేత

MNCL: జైపూర్ మండలం కేంద్రంలో నిర్వహించిన వివి క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం బహుమతులు అందజేశారు. విన్నర్‌గా నిలిచిన ఇందారం, రన్నర్‌గా నిలిచిన కాన్‌కూర్ జట్టుకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడతాయన్నారు.