కొత్తగా గ్యాస్, పెట్రోల్ బ్లాకులు గుర్తింపు

ELR: గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 గ్యాస్, పెట్రోల్ బ్లాకులు గుర్తించినట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 2020-21 నుంచి 2024-25 మధ్య జరిగిన ఈ అన్వేషణ ద్వారా 182.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలున్నాయి.