సీఎంను కలిసిన ఎమ్మెల్యే తెల్లం

భద్రాద్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురువారం హైదరాబాదులో కలిసి శాలువాతో సత్కరించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వెంకట్రావు మళ్లీ సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది.