చిన్నారుల ‘స్క్రీన్ సమయం’ తగ్గించాలి: సీడీపీవో

చిన్నారుల ‘స్క్రీన్ సమయం’ తగ్గించాలి: సీడీపీవో

KKD: పిల్లల్లో మొబైల్, టీవీ స్క్రీన్ సమయాన్ని తగ్గించడమే ఈ ఏడాది ‘పోషణ్ పక్వాడ’ పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని సీడీపీవో ఎం. పూర్ణిమ తెలిపారు. గురువారం రాజపూడి పీహెచ్‌సీలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు.