చిరు-బాబీ క్రేజీ కాంబో రీలోడెడ్
మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో చిరు చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మళ్లీ మాస్ లుక్‌లో చిరును చూడాలని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.