భారత్ చేరుకున్న 1,600 మంది
దోహా నుంచి 5 ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల్లో 1,600 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో రెండు ఢిల్లీకి, ఒక్కోటి చొప్పున ముంబైకి, కొచ్చిన్‌కి, తిరువనంతపురానికి వచ్చాయి. ప్రస్తుతం ఖతార్ గగనతలం మూసి ఉంది. ప్రత్యేక విమానాలనే నడుపుతున్నారు. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా పశ్చిమాసియా నుంచి 2.44 లక్షల మంది భారత్‌కు వచ్చారు.