నారాయణపురం బీటీ రోడ్డు అస్తవ్యస్తం

కృష్ణా: గత ప్రభుత్వం బంటుమిల్లి, మల్లేశ్వరం, పాశ్చాపురం, అర్తమూరు మీదుగా బీటీ రోడ్లు నిర్మించింది. నారాయణపురం రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేయడంతో గుంతలమయంగా మారింది. రోడ్డుపై చాలా చోట్ల కంకర తేలి, వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా పెదపట్నం, కానూరు వంటి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.