అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

ASR: హుకుంపేట మండలంలో కొంతిలికి చెందిన కొర్ర ప్రవీణ్(28) శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులో ఉన్న పొలంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.