2019లో భర్త సర్పంచ్.. 2025లో భార్య
SDPT: దుబ్బాక మండలం ఆకారంలో మరోసారి అదే కుటుంబానికి సర్పంచ్ పీఠం దక్కింది. 2019లో గ్రామ సర్పంచ్ కాసా నాగభూషణం ఎన్నికయ్యారు. 2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళా విభాగంలో ఆయన భార్య హంస పోటీ చేసి 166 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు గ్రామ సర్పంచ్ పదవి ఒకే కుటుంబానికి దక్కడం విశేషంగా నిలిచింది.