అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
TPT: తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. నూతన కోనేరు నిర్మాణ పనులను, దేవాలయ పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. చరిత్ర పుటలలో నిలిచే విధంగా తలకోనలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.