సాయిశ్రేష్టితను సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
HNK: ఎల్కతుర్తి (M) కేశవాపూర్ గ్రామానికి చెందిన సాయి శ్రేష్ఠిత ఇంటర్‌లో 997 మార్కులు సాధించింది. ఈ మేరకు సాయి శ్రేష్ఠితను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉంటూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని, విద్యారంగ బలోపేతానికప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు.