కొండ చిలువ.. భయపడ్డ ప్రజలు..!
ELR: టీ.నర్సాపురం మండలంలోని వీరభద్రారం వెళ్లే దారిలో బుధవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రహదారి పక్కన చెట్టుకు చుట్టుకుని ఉండగా గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామస్థులు దాడి చేసి పామును చంపినట్లు చెప్పారు. గ్రామంలోకి వచ్చిన ఈ కొండచిలువ రెండు కోళ్లను తిన్నట్లు వెల్లడించారు.