రికార్డ్ స్థాయిలో ప్రథమ సంవత్సరంలో 450మంది చేరిక

SRPT: కొన్నేళ్లుగా అడ్మిషన్‌లు లేక వెలవెలబోతున్న కోదాడలోని KRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం వచ్చింది. కొంతకాలంగా 200 మంది చేరడమే గగనమవుతున్న తరుణంలో ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్‌లో వివిధగ్రూపుల్లో కలిపి ఇప్పటి వరకు 450 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందడం విశేషం. ఈ అడ్మిషన్‌లకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.