నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఆంజనేయులు

నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఆంజనేయులు

ELR: నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పీడీ ఆంజనేయులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయవాడ డిపోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన ఆయనకు ఉన్నతాధికారులు నూజివీడు డిపో మేనేజర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆంజనేయులును కలిసిన కార్మిక సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. డిపో అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.