ప్రేమ పేరుతో యువకుడి దారుణ హత్య

ప్రేమ పేరుతో యువకుడి దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు ఘటనగా నిలిచిన శివసాయి (20) హత్య స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సాయి నాన్నమ్మ వద్దే పెరిగాడు.ప్రేమించిన అమ్మాయితో భవిష్యత్తు నిర్మించుకోవాలని కలలు కన్న అతడి జీవితం అకస్మాత్తుగా దారుణంగా ముగియడంతో వృద్ధ నాన్నమ్మ కన్నీరుమున్నీరవుతోంది. ప్రేమ పేరుతో వెంటాడిన మృత్యువు కలచివేసింది.