ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
KKD: రైతులు పండించిన ప్రతి వరి గింజకు కనీస మద్దతు ధర కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం కోటనందూరు మండలం ఎస్సార్ పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా రైతు సేవా కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.