'ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి'

వనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖి చేసి, ప్రసవాల రిజిస్టర్‌ను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు ఉండి కూడా నెలలో 2-3 ప్రసవాలు మాత్రమే జరగటం ఏంటని సూపరిండెంట్‌ను ప్రశ్నించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.