'మహిళలకు ఆదర్శంగా మొల్లమాంబ'
ప్రకాశం: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ భావితరాల మహిళలకు ఆదర్శప్రాయమని మార్కాపురం జేసీ శ్రీనివాసులు అన్నారు. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా పట్టణంలోని తర్లపాడు రోడ్‌లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి నివాళులర్పించారు. మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం లేని 16వ శతాబ్దంలోనే తన ప్రతిభతో రామాయణాన్ని తెలుగులో అనువాదించి స్ఫూర్తిగా నిలిచారన్నారు.