VIDEO: బతికుండగానే డెత్ సర్టిఫికెట్
అన్నమయ్య: మదనపల్లె సీటీఎం క్రాస్ రోడ్డుకు చెందిన పీ. సయ్యద్ ఖాన్ తాను బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారని ఆరోపించారు. తన ఆస్తి కోసం దావూద్ ఖాన్ నకిలీ సర్టిఫికెట్ తయారు చేశాడని తెలిపారు. సోమవారం కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.