కొనుగోలు కేంద్రాల కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన
KMM: మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు అన్నారు. ప్రతి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం పెట్టిన షరతును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం ఇచ్చారు.