దీపాలతో మెరిసిన నడిగడ్డ జమ్ములమ్మ ఆలయం

GDWL: నడిగడ్డ జమ్మిచేడు జమ్ములమ్మ దేవస్థానంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అర్చన, ఆకుపూజ, హోమాది పూజా కార్యక్రమాలు జరగగా, గద్వాల, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దీపాల వెలుగులో అమ్మవారిని దర్శించుకున్నారు.