వెలిశాల సర్పంచ్‌గా మంజుల సతీష్ గౌడ్ ఘన విజయం
SRPT: తిరుమలగిరి(M) వెలిశాల గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుంభం మంజుల సతీష్ గౌడ్ 213 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.