మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు

మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు

కృష్ణా: మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా జడ్జికి ఆగంతకుడు మెయిల్ పెట్టినట్లు సమాచారం. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ బృందం కోర్టుకు చేరుకుని పరిసరాలను తనిఖీలు చేస్తున్నారు. కాగా, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.