'నేషనల్ హైవేస్‌కు సంబంధించి చర్యలు తీసుకోవాలి'

ELR: ఏలూరు పార్లమెంటు పరిధిలో నేషనల్ హైవేస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌కు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కలిసి నాలుగు సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎంపీ అందజేశారు.