'బలిఘట్టంలోనే శివపార్వతుల విగ్రహాన్ని నిర్మించాలి'
AKP: నర్సీపట్నం పెద్ద చెరువులో నిర్మించతలపెట్టిన 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి సన్నిధిలో నిర్మించాలని వైసీపీ నాయకులు కోరారు. సోమవారం గొలుగొండ మండలం దారమట్టం ఉమాధార మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బలిఘట్టం వంటి పుణ్యక్షేత్రంలో శివపార్వతుల విగ్రహాన్ని నిర్మిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.