'నమ్ముకున్న కుటుంబాలకు అండగా ఉంటాం'

BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో జరుపుల శ్రీను బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో శ్రీను భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.