రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

ELR: జిల్లాలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కలెక్టర్ వెట్రిసెల్వి మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియజేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్షించారు. ఎరువుల అక్రమ రవాణాను నివారించడానికి ఇతర జిల్లాల, రాష్ట్రాల చెక్ పోస్టుల వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.