'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
ప్రకాశం: అమ్మ జన్మనిస్తే హెల్మెట్ మనకి పునర్జన్మను ప్రసాదిస్తుందని చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు క్షేమంగా గమ్యస్థానానికి చేరాలని సూచించారు.