సీసీ కెమెరాల పట్ల అవగాహన కల్పించిన ఎస్సై
KMR: గాంధారి మండలం బీర్మల్ తండాలో ఎస్సై మహేందర్ పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.