20 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత
RR: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో కేశంపేట మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.8. 42 లక్షల విలువచేసే సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే నిరుపేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.