మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

CTR: పుంగనూరు మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సోమవారం కార్యాలయం వద్ద నిరసన తెలిపి చైర్మన్ అలీమ్ భాషకు వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.